News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Tuesday, April 7, 2026

అంబేద్కర్ వర్సిటీలో చిత్రకళా శిబిరం ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 7, 2026 : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న చిత్ర కళా శిబిరం మంగళ వారం ప్రారంభమైంది. కార్యక్రమానికి అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్ప చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సామాజిక సాధికారక ఉత్సవాల నిర్వహణా ఆవశ్యకతను వివరించారు. కళాకారులు రూపొందించే చిత్రాలు కూడా ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కళాఖండాలను రూపొందించాలని సూచించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.యల్. విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ కళాకారులు గీసే చిత్రపటాలు గ్రామీణ, పేద విద్యార్ధులకు స్పూర్తిగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ఓఎస్డీ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్, ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. రజనీ అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...