News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Wednesday, April 22, 2026

UNIVERSITIES REQUIRE CUTTING EDGE TECHNOLOGY FOR LEARNERS : Sri Praveen Prakash IAS (Retd).




• BRAOU organized lecture on “Digital Transformation of Higher Education” 

 Hyderabad, April 22, 2026: Dr. B. R. Ambedkar Open University organized a lecture program cum Interaction on “Digital Transformation of Higher Education” on Wednesday at the University campus. Sri. Praveen Prakash IAS (Retd), Former Principal Secretary of School Education, Government of Andhra Pradesh participated as the keynote speaker for the program.

Tuesday, April 14, 2026

దేశం ఎదగాలంటే, విద్య, మహిళా సాధికారతే కీలకం - తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా




 • జ్యోతి రెడ్డి ఫౌండేషన్ కృషి ప్రశంసనీయం : బండ ప్రకాష్ 

 • 375 మంది ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు నగదు ప్రోత్సాహకాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 14: ప్రపంచ శక్తిగా భారతదేశ ఎదుగుదలకు విద్య, మహిళా సాధికారతే కీలకమని తెలంగాణ గవర్నర్ శ్రీ. శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. సామాజిక సాధికార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమతా స్కీం కింద ఉచిత విద్యకు ఎంపికైన 375 ఆదివాసీ, ఇద్దరు ట్రాన్స్‌జెండర్ విద్యార్ధులకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ఫెలోషిప్ (JRFF) ప్రదానోత్సవం కార్యక్రమం మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ. శివ్ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ, భారతదేశంలో విద్య, సామాజిక సంస్కరణలకు మార్గదర్శకులైన దార్శనిక నాయకులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, బి.ఆర్. అంబేద్కర్ అని పేర్కొన్నారు.

విశ్వవిద్యాలయాలలో ఏఐ ఆధారిత హైబ్రిడ్ విద్య అవసరం - డా. యోగితా రాణా, ఐఏఎస్


 • యూనివర్సిటీ లో ఏ.ఐ. డిజిటల్ ల్యాబ్ ప్రారంభం 

 • అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న విద్యా శాఖ కార్యదర్శి 

హైదరాబాద్, ఏప్రిల్ 14, 2026 : విశ్వవిద్యాలయాలలో ఆర్తిఫీసియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత హైబ్రిడ్ విద్య అవసరమని తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి డా.యోగితా రాణా, ఐ.ఏ.ఎస్. పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల్లో” భాగంగా విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో ఏఐ డీఈఏ ల్యాబ్స్‌లో కీలక డిజిటల్ సాధికారత కార్యక్రమాలైన 2.0 ల్యాబ్ ను ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

Monday, April 13, 2026

SAMATHA FREESHIPS FOR ADIVASI AND TRANSGENDER STUDENTS AT BRAOU

• Governor Shri Shiv Pratap Shukla will be present SamathaFreeships.

Hyderabad, April 13, 2026: Shri Shiv Pratap Shukla, Hon’ble Governor of Telangana and Chancellor, BRAOU will participate as the Chief Guest in the “Samatha Fellowship Award Ceremony” jointly organized by Dr. B.R. Ambedkar Open University and Jyothi Reddy Foundation Fellowship (JRFF) at its campus on Tuesday.

దేశంలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అవసరం - ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్




బౌద్ధం, విద్య, సాంకేతికతతో సామజిక మార్పు సాధ్యం - వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి 

హైదరాబాద్, ఏప్రిల్ 13, 2026: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అనుసరించిన బౌద్ధం, విద్య, సాంకేతికత తోనే సామజిక మార్పు సాధ్యమని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. సామాజిక సాధికారత వారోత్సవాల్లో భాగంగా, "బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తనవైపు తిప్పుకోగలవా" అనే అంశంపై డా.బి.ఆర్. అంబేద్కర్ స్మారక ఉపన్యాసం నిర్వహించారు.

Sunday, April 12, 2026

ఓపెన్ యూనివర్సిటీలో సోమవారం అంబేద్కర్ స్మారకోపన్యాసం - ప్రధాన వక్తగా ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్


 

హైదరాబాద్, ఏప్రిల్ 12, 2026: డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో నిర్వహిస్తున్న 'సామాజిక సాధికారత వారోత్సవాల'లో భాగంగా, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని "బౌద్ధేతర భావజాలాలు అంబేద్కర్‌ను తమవైపు తిప్పుకోగలవా?" అనే అంశంపై స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒ ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Saturday, April 11, 2026

యూనివర్సిటీలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సమావేశం



ప్రజాభిప్రాయాల చర్చకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదిక : ప్రొ. పుష్పా చక్రపాణి

హైదరాబాద్, ఏప్రిల్ 11, 2026: డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “సామాజిక సాధికారత ఉత్సవాల్లో” భాగంగా ప్రజాస్వామిక రచయితల వేదిక అధ్వర్యంలో “అంబేద్కర్ పై ప్రసంగాల వ్యాసాలను“ క్రోడీకరించిన పుస్తక పరిచయ సభ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే స్మారకోపన్యాసం




కులరహిత విద్యయే 'ఫూలే' దార్శనికత - వీసీ ప్రొ ఘంటా చక్రపాణి 

- ఫూలే పోరాటం భవిష్యత్ తరాలకు ఆదర్శం : సామాజికవేత్త డా. సంగి శెట్టి శ్రీనివాస్

• అంబేద్కర్ వర్శీటీలో 'ఫూలే' తెలుగు సినిమా ప్రివ్యూ

• 'ఫూలే' చిత్ర యూనిట్ ను సన్మానించిన వీసీ ప్రొ. చక్రపాణి

• వర్శీటీలో కొనసాగుతున్న సామాజిక సాధికారత ఉత్సవాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 11, 2026: కులరహిత విద్యయే 'ఫూలే' లక్ష్యం అని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “సామాజిక సాధికార ఉత్సవాల్లో” భాగంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు.

Friday, April 10, 2026

“ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం : విభేదాలు, భవిష్యత్ దిశ” అంశంపై మొగసిన జాతీయ సదస్సు


సామాజిక ప్రగతికి సమగ్ర సంస్కరణలే కీలకం - ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ. వి. బాలకిష్ట రెడ్డి 

 • అంబేద్కర్ వర్శీటీలో కొనసాగుతున్న “సామాజిక సాధికార ఉత్సవాలు” 

 హైదరాబాద్, ఏప్రిల్ 10, 2026: సామాజిక ప్రగతికి సమగ్ర సంస్కరణలే కీలకమని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.వి. బాలకిష్ట రెడ్డి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అర్థశాస్త్ర విభాగం, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం : విభేదాలు, భవిష్యత్ దిశ” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.వి. బాలకిష్ట రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం


కళాకారులు తమ కళతో సమాజాన్ని ప్రభావితం చేయాలి - వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం - విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి 

హైదరాబాద్, ఏప్రిల్ 9, 2026: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా మూడు రోజుల పాటు జరిగిన “చిత్ర కళా శిబిరం” ముగిసింది.

Thursday, April 9, 2026

“ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం : విభేదాలు, భవిష్యత్ దిశ” అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సుు ప్రారంభం


రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి - సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్. బి. సుదర్శన్ రెడ్డి 

 • అంబేద్కర్ వర్శీటీలో కొనసాగుతున్న సామాజిక సాధికార ఉత్సవాలు

 హైదరాబాద్, ఏప్రిల్ 9, 2026: రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, అర్థశాస్త్ర విభాగం, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం : విభేదాలు, భవిష్యత్ దిశ” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

Wednesday, April 8, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” అంశంపై సింపోజియం

సమ సమాజ స్థాపనకు రిజర్వేషన్లు కీలకం : వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
 
 • వర్శీటీలో కొనసాగుతున్న సామాజిక సాధికారత ఉత్సవాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 8, 2026 : సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా “రిజర్వేషన్లు – ప్రజాస్వామ్యం – సవాళ్లు” అనే అంశంపై బుధవారం సింపోజియం నిర్వహించారు.

Tuesday, April 7, 2026

రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసిన అంబెడ్కర్ వర్శిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి

• అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆహ్వానం 
 హైదరాబాద్, ఏప్రిల్ 7, 2026: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ.ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి మర్యాదపూర్వంగా కలిసి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” వివరాలను వివరించారు.

అంబేద్కర్ వర్సిటీలో చిత్రకళా శిబిరం ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 7, 2026 : డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న చిత్ర కళా శిబిరం మంగళ వారం ప్రారంభమైంది.

అంబేద్కర్ వర్సిటీలో ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభం

హైదరాబాద్, ఏప్రిల్ 7, 2026: డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సామాజిక సాధికారత వారోత్సవాల” లో భాగంగా డా.బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా "సాంస్కృతిక, క్రీడా సమ్మేళనాన్ని" విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో నిత్యం బిజీ గా ఉండే ఉద్యోగులు క్రీడల్లో పాల్గొంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలనీ తద్వారా పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా మానసిక, శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...