News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Saturday, April 11, 2026

యూనివర్సిటీలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సమావేశం



ప్రజాభిప్రాయాల చర్చకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వేదిక : ప్రొ. పుష్పా చక్రపాణి

హైదరాబాద్, ఏప్రిల్ 11, 2026: డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో “సామాజిక సాధికారత ఉత్సవాల్లో” భాగంగా ప్రజాస్వామిక రచయితల వేదిక అధ్వర్యంలో “అంబేద్కర్ పై ప్రసంగాల వ్యాసాలను“ క్రోడీకరించిన పుస్తక పరిచయ సభ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమే మాట్లాడుతూ రచయితలు, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్చగా మాట్లాడుకునేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ ఒక వేదికగా ఉంటుందన్నారు. ఈ వేదిక ద్వారా రచయితలు వారి ఆలోచనలు, భావాలు, అనుభవాలు, సామాన్య ప్రజల సమస్యలకు గొంతుకగా మారాలని, అది తమ రచనల రూపంలో ప్రజలను చైతన్య పర్చాలని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రజాస్వామిక రచయిత్రులు రచించిన అంబేద్కర్ వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకోచ్చిన కాత్యాయనీ విద్మహే, దీప్తి సిర్ల; సుధాకిరణ్; కనీజ్ ఫాతిమా వారి వారి అభిప్రాయాలను వివరించారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...