News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Saturday, February 7, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ‘గోల్డెన్ ఛాన్స్’ - వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి • డిగ్రీ పట్టాతో పాటే కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ హామీ • టీసీఎస్ iON తో సంయుక్తంగా ప్రత్యేక కోర్సు ప్రారంభ

హైదరాబాద్, ఫిబ్రవరి 7, 2026: డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సంపాదించడం ప్రతి విద్యార్థి కల. ఆ కలను సాకారం చేస్తూ డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCSiON) తో కలిసి వినూత్నమైన 'జాబ్ అచీవర్ - బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్' ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది విద్యార్ధులకు బంగారు బాట వేయనుందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం లో అడ్మిషన్స్ జరుగుతున్నాయని, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పటికే మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇందులో చేరడానికి మార్చ్ 15 చివరి తేదీగా పేర్కొన్నారు. ప్రొ. చక్రపాణి శనివారం క్యాంపస్ లో టీసీఎస్ ప్రోగ్రాం డైరెక్టర్ లీనా టిప్రే, ప్రతినిధి నరేందర్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, ఓఎస్డీ ప్రొ. రాబింద్రనాథ్ సోలమన్, ప్లేస్ మెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి లతో కలిసి పోస్టర్ ను విడుదల చేశారు. ఐటీ, సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలనుకునే విద్యార్థులకు ఇది గొప్ప వరంగా ప్రొ. ఘంటా చక్రపాణి అభివర్ణించారు. ఈ ప్రోగ్రామ్ కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, టీసీఎస్ తో అనుసంధానమై ఉన్న 3000 పైగా కార్పొరేట్ సంస్థలలో ఉద్యోగ అవకాశాలను కల్పించేలా శిక్షణను ఇస్తుందని వెల్లడించారు. బిజినెస్ ఆపరేషన్స్, కస్టమర్ సపోర్ట్, సేల్స్, అడ్మిన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి విభిన్న రంగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యంగా వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి వివరించారు. పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ : ఈ 'జాబ్ అచీవర్ - బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్' ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్ధులకు ఎం.ఎస్. ఆఫీస్, CRM టూల్స్, ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఇంటర్వ్యూ స్కిల్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ప్రత్యేక ఎల్.ఎం.ఎస్. ప్లాట్ ఫార్మ్ పై రూపొందించిన మాడ్యుల్స్ ద్వారా విద్యార్థులు సొంతంగా ఆన్లైన్ లో ప్రాక్టీసు చేస్తూ సులభంగా ఈ ప్రత్యేక కోర్సు నేర్చుకోవచ్చు. సందేహాల నివృత్తి కోసం నిపుణులతో లైవ్ చాట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కేవలం థియరీ మాత్రమే కాకుండా, నేరుగా పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టులలో పని చేసే అవకాశం కూడా విద్యార్ధులకు లభిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత లభించే TCSiON, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సర్టిఫికేట్, వేలాది కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలకు బాటలు వేస్తుంది. ఎవరు అర్హులు? డాక్టర్‌ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బి.ఏ (B.A), బి.కామ్ (B.Com) లేదా బి.ఎస్సీ (B.Sc) చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులందరూ ఈ ప్రోగ్రామ్‌లో చేరడానికి అర్హులు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే సమయానికే చేతిలో గొప్ప పేరున్న సంస్థలో ఉద్యోగంతో బయటకు వచ్చేలా ఈ కోర్సును రూపొందించారు. ఆసక్తి గల విద్యార్థులు వెంటనే నమోదు చేసుకోవాలి, మరింత సమాచారం కోసం వెబ్‌సైట్: www.braou.ac.in లేదా 040 23680555 లో లేదా టోల్-ఫ్రీ నంబర్: 1800-599-0101 లో సంప్రదించాలి.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...