News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Thursday, February 19, 2026

సంత్ సేవాలాల్ గొప్ప అహింసా వాది

: అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 


• అంబేద్కర్ వర్షిటీలో ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి
 హైదరాబాద్ ఫిబ్రవరి 19, 2026: సంత్ సేవాలాల్ బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా అహింసా సిద్ధాంతానికి పునాదులు వేసిన మహానీయుడని, డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287 వ జయంతి సందర్భంగా డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గురువారం ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి, అయన మాట్లాడుతూ సంత్ సేవాలాల్ గొప్ప మానవతా వాదిగా, బంజారాల ఆరాధ్య దైవంగా కీర్తి పొందినట్లు వివరించారు. బంజారాల బాగు కోసం, నిరంతరం వాళ్ళ ఆత్మగౌరవం కోసం పని చేశారని పేర్కొన్నారు. శతాబ్దాల క్రితమే సంత్ సేవాలాల్ ఆదర్శ జీవనం గడిపారని, యువత సేవాలాల్ ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రొ. ఘంటా చక్రపాణి పిలుపునిచ్చారు. సేవాలాల్ ప్రఖ్యాత పర్యావరణ వేత్తగా రెండు వందల సంవత్సరాల క్రితమే గుర్తింపు పొందడం అంటే ఆయన దూరదృష్టి ని అర్ధం చేసుకోవచ్చని వివరించారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మాహారాజ్ : భాంగ్య భుక్య ఈ కార్యక్రమంలో కేంద్రీయ విశ్వవిద్యాలయ చరిత్ర అధ్యాపకులు ప్రొ. భాంగ్య భుక్య ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. అయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ దేశంలోని బంజారాల ప్రాంతాలలో గొప్ప గౌరవనీయమైన ఆధ్యాత్మిక వ్యక్తిగా కీర్తించ పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బంజారాల సంస్కృతికి ఆధ్యాత్మికతను జోడిస్తూ, దేశమంతా సంచరిస్తూ, సమాజానికి హితబోధ చేశారన్నారు. దేశమంతా ఛిన్నాభిన్నంగా ఉన్న బంజారా సమాజాన్ని తన పర్యటనల ద్వారా సేవాలాల్ ఏకం చేశారన్నారు. సేవాలాల్ ఒక దార్శనికుడు, తాత్వికవేత్త. ఆధ్యాత్మిక బోధనలు, భక్తి ప్రవచనాలు చెప్పుతూ తన జీవితాన్ని బంజారాల అభ్యున్నతి కోసం త్యాగం చేశారని, మంచి మాటలతో ప్రజలను చైతన్యవంతులను చేశారని వివరించారు. తన కీర్తి కోసం పనిచేసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని, ఆ వర్గాల అభివృద్దే లక్ష్యంగా ముందుకెల్లారని వివరించారు. ఆయన మనస్తత్వం తెలిసిన చరిత్రకారులే సంత్ సేవాలాల్ రూపాన్ని ఊహించి ఫోటోను తయారు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ బంజారాలా ఆరాధ్య దైవంగా సంత్ సేవాలాల్ కీర్తించ పడటం అంటే ఆ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరనీయమని వెల్లడించారు. ఎస్సీ ఎస్టీ సెల్ లైసన్ ఆఫీసర్ డా. బానోత్ ధర్మ కార్యక్రమ నిర్వహణ ఆవశ్యకతను, సంత్ సేవాలాల్ సేవలను సభకు వివరించారు. అంతకు ముందు భోగ్ భండార్ (పూజా కార్యక్రమం) డా. ధర్మా నాయక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బంజారా ఉద్యోగులు పాల్గొని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. చంద్రకళ, ప్రొ..ప్రమీలా కేతావత్; డా. బోజు శ్రీనివాస్, రెడ్యా నాయక్, మాలోత్ బుద్దా నాయక్, పాండు నాయక్, కాంతం ప్రేమ కుమార్; నవీన్ నాయక్, పలు విభాగాల అధిపతులు, డీన్స్, బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...