News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Saturday, February 7, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో... డిజిటల్ రిసోర్స్ సెంటర్ కు భూమి పూజ

హైదరాబాద్, ఫిబ్రవరి 6,2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంగణంలో డిజిటల్ రిసోర్స్ సెంటర్ (డి.ఆర్.సి.), సెంట్రల్ ఇంస్త్రుమేంటేషన్ ల్యాబ్ భవన నిర్మాణానికి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి శుక్రవారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ డి.ఆర్.సి. భవనాన్ని రూ. 12.9 కోట్ల పీఎం ఉషా నిధులతో నిర్మించనున్నట్లు వీసీ వెల్లడించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు జనవరి 26, 2025న యూనివర్సిటీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ. ఏ. రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. అందులో ఈ భావన నిర్మాణం కూడా ఉంది. కాగా పాలనా పరమైన అనుమతులు, నిధుల విడుదల, భావన నిర్మాణ ప్లాన్ రూపొందించుకున్న తర్వాత శుక్రవారం భూమి పూజ చేసినట్లు వెల్లడించారు. సంవత్సర కాలంలోనే ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధికారులను, నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ జి. పుష్పా చక్రపాణి; రిజిస్ట్రార్ డా. యల్. విజయా కృష్ణా రెడ్డి; పి. ఎం. ఉషా ప్రాజెక్ట్ నోడల్ అధికారిణి ప్రొ. పల్లవీ కాబడే; డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, అధికారులు ప్రొ. వెంకట రమణ, ప్రొ. భోజు శ్రీను, ప్రొ. రజనీ, డా. భానోత్ ధర్మ, ఎన్సీ వేణు గోపాల్, ప్రభుత్వ ఇంజనీర్ అనిత, వి.కె.ఆర్. నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ వినయ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...