News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Sunday, March 15, 2026

సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌పై అవగాహన

అంబేద్కర్ వర్సిటీ - TCS iON ప్రోగ్రాం విద్యార్థులకు ఉపయోగం - ప్రొ. పల్లవీ కాబడె హైదరాబాద్, మార్చి 15, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించనుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో - ఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబడే, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాఘవేంద్ర పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపిందించిన "TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్"‌, ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేపట్టిన ఉపాధి, స్కిల్ బేస్డ్ కోర్సులపై సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొ. పల్లవి, కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాఘవేందర్ లు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు TCSION తో డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివే విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యే విధంగా తీర్చిదిద్దుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే పూర్తి చేయొచ్చన్నారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత టీసీఎస్అయాన్ ఆధ్వర్యంలో సుమారు మూడున్నర వేలకు పైగా పార్టనర్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందన్నారు. మహిళా విద్యార్థులను వ్యాపార వేత్తలుగా తీర్చి దిద్దడానికి WeHub తో ప్రత్యేక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రొ. పల్లవి వెల్లడించారు. వీటితో పాటు ఒప్పందాలు కుదుర్చుకున్న వాటిలో ప్రఖ్యాత సంస్థలు RASCI, శ్రీ రామానంద తీర్ధ రూరల్ ఇన్స్టిట్యూట్ వంటివి కూడా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కెరియర్ వృద్ధి, స్కిల్స్ పెంపొందించడం, ఆంగ్ల భాషపై పట్టు వచ్చేలా వర్క్‌షాప్‌లతో పాటు, క్యూరేటెడ్ వీడియో కంటెంట్, క్విజ్‌లు మరియు ప్రాక్టికల్ సెషన్‌ల ద్వారా ప్రయోజనం పొందేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ప్రొ. ఘంటా చక్రపాణి వీసీ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థులకు ఉపాధి కల్పించేలా యూనివర్సిటీ అనేక సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం, సమతా స్కీం కింద ఉచిత విద్య, నిపుణ స్కీం లో ఫెలోషిప్స్ అందిస్తున్నట్లు ఆమె వివరించారు. డా. రాఘవేందర్ మాట్లాడుతూ యూనివర్సిటీ అనేక నూతన విధానాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్ ప్రొ. శంకర్ కార్యక్రమంలో అధ్యాపకులు డా. శంకర్, డా. మఖ్డూమ్, సిటీ కళాశాళ అధ్యాపకులు, ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...