News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Sunday, March 29, 2026

జంట నగరాల్లోని 13 అధ్యయన కేంద్రాల్లో పలు కోర్సులపై అవగాహన

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో విద్యార్థులకు ఉపాధి కోర్సులు - డైరెక్టర్లు ప్రొ. పుష్పా చక్రపాణి, ప్రొ. రబింద్రనాథ్ సోలమన్

 * మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం - ప్రొ. పల్లవీ కాబడి

 - స్కిల్ కోర్సులపై ప్రత్యేక దృష్టి : డైరెక్టర్, ప్రొ. ఆనంద్ పవార్ 

 హైదరాబాద్, మార్చి 29, 2026: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కోర్సులు, నైపుణ్యాల కల్పనపై జంట నగారాల్లోని పలు అధ్యయన కేంద్రాల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, ఈఎంఆర్ఆర్ సి డైరెక్టర్, వీసీ ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కో - ఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబడే, డీఎంపీ డైరెక్టర్ ప్రొ. ఆనంద్ పవార్, విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు, ప్రొ. పి. వెంకట రమణ, ప్రొ. భోజు శ్రీనివాస్, ప్రొ. శ్రీదేవి, ప్రొ. రజని తదితరులు అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి ఆధ్వర్యంలో వేర్వేరు అధ్యయన కేంద్రాల్లో పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేర్వేరు కళాశాలల్లో వారు ఉద్యోగ, ఉపాధి కోర్సులు, నైపుణ్య కోర్సుల పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే ఆదివారం జంటనగరాల పరిధిలోని 13 అధ్యయన కేంద్రాలలో 30 మంది డైరెక్టర్లు, అధ్యాపకులు విద్యార్థులకు కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన కోర్సుల గురించి వివరించారు. TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ను కల్పించనుందని ప్రొ. రబింద్రనాథ్ సోలమన్ పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపిందించిన "TCSiON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్"‌, ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేపట్టిన ఉపాధి, స్కిల్ బేస్డ్ కోర్సులు విద్యార్థికి డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగం పొందేలా రూపొందించినట్లు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు TCSION తో డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివే విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యే విధంగా తీర్చిదిద్దుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే పూర్తి చేయొచ్చని వివరించారు. దూర విద్యా విధానంలో ఈ మూడు సంవత్సరాల ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత టీసీఎస్అయాన్ ఆధ్వర్యంలో సుమారు మూడున్నర వేలకు పైగా పార్టనర్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను పొందుతారని వివరించారు. కెరియర్ వృద్ధి, స్కిల్స్ పెంపొందించడం, ఆంగ్ల భాషపై పట్టు వచ్చేలా వర్క్‌షాప్‌లతో పాటు, క్యూరేటెడ్ వీడియో కంటెంట్, క్విజ్‌లు మరియు ప్రాక్టికల్ సెషన్‌ల ద్వారా విద్యార్థులు విస్తృత ప్రయోజనం పొందుతారని వివరించారు. కోర్సు పూర్తయిన తర్వాత, యూనివర్సిటీ, TCS అయాన్ నుండి జాతీయ స్థాయిలో పరిశ్రమ-గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందుకుంటారని వివరించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా యూనివర్సిటీ అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుందని అందులో భాగంగా TCSiON తో పాటు wehub, RASCI, శ్రీ రామానంద తీర్ధ రూరల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొ. ఘంటా చక్రపాణి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యార్థులకు ఉపాధి కల్పించేలా యూనివర్సిటీ అనేక సరికొత్త కార్యక్రమాలను రూపొందించిందని వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. డిగ్రీతో పాటు వీటిని అదనంగా ఎంచుకోవాలని, వాటికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రొ. పుష్పా చక్రపాణి వివరించారు. ఇందులో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలు, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీషు భాషపై పట్టు, ఐటీ, కంప్యూటర్ నైపుణ్యాలు, మొబైల్ మరమ్మత్తు, సౌర శక్తి , CC కెమెరాల మేనేజ్మెంట్ లాంటి కోర్సులు, మహిళల కోసం బ్యూటీషియన్ కోర్సులు, జర్దోజి, ఎంబ్రాయిడరీ లాంటి కోర్సులతో పాటు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా కోర్సులకు రూపకల్పన చేశామని ప్రొ. పల్లవీ కాబడే వివరించారు. ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ , ప్రొ. వెంకట రమణ, డా. యాదగిరి (ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో), ప్రొ. పల్లవీ కాబడే, ప్రొ. కె. కృష్ణా రెడ్డి (పటాన్ చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో), ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. చంద్ర కళ, డా. రజిత, (బేగంపేట్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో), ప్రొ. భోజు శ్రీనివాస్, డా. రాఘవేంద్ర, డా. గురవయ్య (సికింద్రాబాద్ సర్దార్ పటేల్ కళాశాలలో), ప్రొ. కె. శ్రీదేవి, డా. జి. అశోక్, డా. ఉషశ్రీ (ఇందిరా ప్రియదర్శిని మహిళా ప్రభుత్వ కళాశాల లో), డా. విజయ్ కుమార్, ప్రొ. ఎన్. రజని, ప్రొ. దయాకర్ (చంచలగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో), డా. కె. అవినాష్ , డా. కె. విజయ్ (కూకట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో) డా. వై. వెంకటేశ్వర్లు, డా. నర్సయ్య బట్టు, డా. వై. కుమార్ (హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో), డా. పి. లక్ష్మణ్, డా. కోటేశ్వర రావు, డా. ఎన్. రామకృష్ణ (మల్కాజిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో), డా. కె. దయాకర్, డా. బి . మహేందర్, డా. ఏం. చిరంజీవి (విద్యానగర్ ఏస్. వి. ఎస్. డిగ్రీ కళాశాల లో) డా. బి. శ్రీనివాస్, డా. సునీల్ కుమార్ పోతన, డా. జె. అరుణ (నారాయణగూడా బి. జె. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో) డా. పి. రాధాకృష్ణ, డా. అనంత శంకర్, డా. జి. రామేశ్వర్ గౌడ్ (ప్రభుత్వ సిటీ కాలేజీ), డా. ఎండీ. ఖాజా మఖ్డూమ్, డా. కే. ఉమాదేవి (ఫలక్ నుమా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో) పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు పలు కోర్సులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా అధ్యయన కేంద్రాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...