News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Tuesday, March 24, 2026

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేటి నుండి రెండు రోజుల జాతీయ సదస్సు

• ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ 26 వ జాతీయ సదస్సు హైదరాబాద్, మార్చి 24: ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా), డా.బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా, ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో), తెలంగాణ విద్యా మండలి; ఇంఫ్లిబ్నెట్ ( INFLIBNET) గుజరాత్ భాగస్వామ్యంతో బుధ, గురు వారాల్లో “సరిహద్దులకు అతీతంగా సరికొత్త దిశలో సార్వత్రిక విద్య" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. డిజిటల్ పరివర్తన, విధానపరమైన చట్రాలు, విద్యకు సమ్మిళిత గుర్తింపు పై దృష్టి సారిస్తూ, సార్వత్రిక దూర విద్యా విధానం (ODL) వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించడమే ఈ జాతీయ సదస్సు ప్రధాన లక్ష్యం. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం BRAOU వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరగనుంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆనందరావు విష్ణు పాటిల్ (IAS) ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. IGNOU ఉపకులపతి ప్రొఫెసర్ ఉమా కంజిలాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. కేరళ డిజిటల్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ సాజి గోపీనాథ్ విశిష్ట అతిథిగా పాల్గొంటారు. న్యాక్ (NAAC) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. ఎస్. ప్రసాద్ కీలకోపన్యాసం (Keynote address) చేయనున్నారు. (ఐడియా) అధ్యక్షుడు ప్రొ. కె. సీతారామారావు, (ఐడియా) గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళి మనోహర్ గౌరవ అతిథులుగా పాల్గొంటారు. BRAOU విద్యా విభాగం డైరెక్టర్, కాన్ఫరెన్స్ డైరెక్టర్ ప్రొ. పుష్ప చక్రపాణి, రిజిస్ట్రార్, ఐడియా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎల్. వి. కె. రెడ్డి పాల్గొననున్నారు. డిజిటల్ టెక్నాలజీ పై రౌండ్ టేబుల్ సమావేశం : డిజిటల్ టెక్నాలజీ : ఓ డి ఎల్ భవిష్యత్తు (“Digital Technologies: Future of ODL”) అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. దీనికి ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. దేశ విదేశాలలోని ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన విశిష్ట నిపుణులు ఇందులో ప్యానలిస్టులుగా పాల్గొంటారు. అనంతరం నిర్వహించే ప్లీనరీ సమావేశంలో ఇంఫ్లిబ్నెట్ (INFLIBINET) నిపుణులు ప్రసంగిస్తారు. అనంతరం, సాంకేతిక సమావేశాలు నిర్వహిస్తారు. రెండవ రోజు, డిజిటల్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ మిశ్రా “ఓపెన్ డిస్టెన్స్ పాలసీ - నాయకత్వం: నిబంధనల పాటింపు, విమర్శనాత్మక భాగస్వామ్యం ” అనే అంశంపై ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి స్మారక ఉపన్యాసంతో ప్రారంభమవుతుంది. దీని తర్వాత “డ్యూయల్ మోడ్ విశ్వవిద్యాలయాలు: సమస్యలు సవాళ్లు” అనే అంశంపై ప్యానెల్ చర్చ జరుగుతుంది. ఓడీఎల్‌లోని కీలక అంశాలపై పలు సాంకేతిక సమావేశాలు జరుగుతాయి. ముగింపు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి డాక్టర్ యోగిత రాణా, ఐఏఎస్, ముఖ్య అతిథిగా హాజరవుతారు. గౌరవ అతిథులుగా ఉత్తరాఖండ్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నవీన్ చంద్ర లోహాని పాల్గోననుండగా ఈ సమావేశానికి ప్రొ. ఘంటా చక్రపాణి అధ్యక్షత వహిస్తారు. సదస్సులో ఎనిమిది సాంకేతిక సమావేశాలు నిర్వహించనుండగా ఇందులో దేశవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుంచి 100 కు పైగా పరిశోధకులు హాజరై తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...