News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Wednesday, March 11, 2026

అంబేద్కర్ వర్షిటీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం



మహిళా విద్యార్ధులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి - : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 
• మహిళలకు గౌరవం ఇంటి నుంచే రావాలి - : రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీ, డైరెక్టర్ ప్రియాంక వర్గీస్, ఐ.ఎఫ్.యస్ 
హైదరాబాద్, మార్చి 11, 2026 : మహిళా విద్యార్ధులు ఆర్ధిక స్వావలంభన సాధించడం, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఘంటా చక్రపాణి ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ మహిళాభివృద్ధి, విస్తరణ కేంద్రం ఆధ్వర్యంలో “గివ్ టు గైన్” అనే అంశంపై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించగా ప్రొ. చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ విద్య సంవత్సరం నుండి వి - హబ్ తో కలిసి "వి - ఎనేబుల్" అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ విశ్వవిద్యాలయం ద్వారా మహిళా విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని మొత్తం విద్యార్ధుల్లో మహిళలు 49 శాతం ఉండడం ఆనందాన్ని ఇస్తుందని ప్రొ. చక్రపాణి వెల్లడించారు. రానున్న రోజుల్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తామని, ప్రఖ్యాత సంస్థలతో అవగాహన కల్పించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, డైరెక్టర్ డా. ప్రియాంక వర్గీస్, ఐ.ఎఫ్.యస్ ప్రధాన వక్తగా పాల్గొన్నారు. డా. వర్గీస్ మాట్లాడుతూ విద్య, కనీస వనరులు కల్పించడం వల్ల మహిళలు చదువుతో పాటు ఆర్ధిక స్వావలంభన సాధించడానికి అవకాశాలు కల్పించినట్లు అవుతుందని వెల్లడించారు. మహిళలకు గౌరవం అనేది మొదటగా తన ఇంటి నుంచే దక్కాలని అప్పుడే వారిలో మనో నిబ్బరం పెంపొందుతుందని, తద్వారా ఉత్తమ ఫలితాలు సాధించడానికి, ఎంచుకున్న వృత్తిలో రాణించడానికి అవకాశం ఉంటుందని ఆమె వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జే. అబ్దుల్ కలాం చెప్పినట్లు మాహిళా విద్యార్ధులు పెద్ద పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రణాళికా ప్రకారం కష్టపడాలని దీంతో విజయాన్ని సులువుగా అందుకోవచ్చని వివరించారు. మహిళా విద్యాభివృద్ధికి, మహిళల సాధికారతకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని, వీసీ ప్రొ. చక్రపాణి ముందు చూపును ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ అకాడమిక్ డైరెక్టర్ ప్రొ.జి. పుష్పా చక్రపాణి అధ్యక్షత వహించారు. ఆమే మాట్లాడుతూ ప్రపంచంలో స్త్రీని మించిన మహా శక్తి ఏదీ లేదని, స్త్రీ లేకపోతే ఈ సృష్టే లేదన్నారు. మహిళల సాధికారత, అభ్యున్నతి, వివక్ష నిర్మూలన పై తమ విశ్వవిద్యాలయం ద్వారా పాఠ్యాంశాలను అందిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిధిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్. విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా తమ యూనివర్సిటీ అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, వీటిని మహిళా విద్యార్ధులు అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ మహిళా అభివృద్ధి, విస్తరణ కేంద్రం ఇంచార్జ్, ప్రొ.కె.రాణి రజిత మాధురి మాట్లాడుతూ కార్యక్రమం నిర్వహణ ఆవశ్యకతను వివరిస్తూ, ప్రధాన వక్తను సభకు పరిచయం చేశారు. కార్యక్రమంలో ప్రొ ఇ. సుధారాణి; ప్రొ.పల్లవి కాబడే; ప్రొ. కె. శ్రీదేవి, ప్రొ.ఎన్.రజని, ప్రొ.మేరీ సునంద; డా. ఉదయిని, రుషీంద్ర మణి, సరిత, విశ్వవిద్యాలయ మహిళా ఉద్యోగులు, విద్యార్థులు, పలు విభాగాల డైరెక్టర్స్, డీన్స్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గున్నారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...