News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Saturday, March 28, 2026

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగ, నైపుణ్య కోర్సులపై అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, మార్చి 29, 2026 : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి కోర్సులు – నైపుణ్యాలపై ఆదివారం అన్ని అధ్యయన కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు కార్పోరేట్ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి అవసరమైన నైపుణ్యం అందివ్వడానికి TCSiON, WeHUB, RASCI, SRTRI వంటి సంస్థలతో ప్రత్యేక కోర్సులు ప్రారంభించినట్లు తెలిపారు.

డిగ్రీతో పాటు వీటిని అదనంగా ఎంచుకోవాలని, వాటికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. TCSiON వారితో పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలు, కంప్యూటర్ స్కిల్స్, ఇంగ్లీషు భాషా నైపుణ్యాలు, ఐటీ నైపుణ్యాలు (B.A., B. Com, B. Sc.) మెదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థలకు అవకాశం ఉందన్నారు.  అదేవిధంగా  రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తో ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు, మొబైల్ మరమ్మత్తు, సౌర శక్తి , CC కెమెరాల మానేజ్మెంట్ లాంటి కోర్సులు, మహిళల కోసం బ్యూటీషియన్ కోర్సులు, ఎంబ్రాయిడరీ లాంటి కోర్సులు ఉన్నాయన్నారు. Wehub సహకారంతో విద్యార్థినులను మహిళా పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ అవగాహణ కార్యక్రమాలు జంట నగరాలతో పాటు అన్ని అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని, విద్యార్థులు అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం  www.braou.ac లో, లేదా సమీపంలోని  అధ్యయన కేంద్రాల కో-ఆర్డినేటర్లను సంప్రదించాలని, లేదా 04౦- 23680333 / 555 లో సంప్రదించాలని సూచించారు. 

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...