News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Sunday, March 15, 2026

⁠ఎం. వి. ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌పై అవగాహన

అంబేద్కర్ వర్సిటీ - TCS iON ప్రోగ్రాం తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ 
- డైరెక్టర్ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్ 
 మహబూబ్ నగర్ , మార్చి 15, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - TCS iON జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ను కల్పించనుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ EMRRC డైరెక్టర్ ప్రొ. రబింద్రనాథ్ సోలమన్ పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపిందించిన "TCS iON - జాబ్ అఛీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్"‌, ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేపట్టిన ఉపాధి, స్కిల్ బేస్డ్ కోర్సులపై ఎం. వి. ఎస్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ. సోలొమన్ మాట్లాడుతు దేశంలో ఎక్కడా లేని విధంగా దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు TCSION తో డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో చదివే విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచే కార్పొరేట్ కంపెనీలకు అవసరమయ్యే విధంగా తీర్చిదిద్దుతూ, ప్రపంచ వ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఈ కోర్సును ప్రత్యేకంగా రూపొందించినట్లు వివరించారు. ఈ కోర్సును డిగ్రీ చదువుతూనే ఏక కాలం లో పూర్తి చేయొచ్చని ఆయన వివరించారు. దూర విద్యా విధానంలో అభ్యసించే విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ మూడు సంవత్సరాల ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత టీసీఎస్అయాన్ ఆధ్వర్యంలో సుమారు మూడున్నర వేలకు పైగా పార్టనర్ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను పొందుతారని వివరించారు. కెరియర్ వృద్ధి, స్కిల్స్ పెంపొందించడం, ఆంగ్ల భాషపై పట్టు వచ్చేలా వర్క్‌షాప్‌లతో పాటు, క్యూరేటెడ్ వీడియో కంటెంట్, క్విజ్‌లు మరియు ప్రాక్టికల్ సెషన్‌ల ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందుతారని వివరించారు. కోర్సు పూర్తయిన తర్వాత, యూనివర్సిటీ, TCS అయాన్ నుండి జాతీయ స్థాయిలో పరిశ్రమ-గుర్తింపు పొందిన సర్టిఫికెట్ అందుకుంటారని వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూనివర్సిటీ అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుందని అందులో భాగంగా TCSiON తో పాటు wehub, RASCI, శ్రీ రామానంద తీర్ధ రూరల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు ఉన్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న యూనివర్సిటీ ప్లేసుమెంట్ అధికారి డా. పి. వేణు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వృత్తి, నైపుణ్య - శిక్షణ కార్యక్రమాలతో విద్యార్థులకు రానున్న రోజుల్లో పలు సంస్థల్లో ఉద్యోగ ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నామని వివరించారు. ప్రొ. ఘంటా చక్రపాణి వీసీ గా పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థులకు ఉపాధి కల్పించేలా యూనివర్సిటీ అనేక సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకొని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. కార్యక్రమంలో ఎం. వి. ఎస్ . ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంతీయ అధ్యయనా కేంద్రం కౌన్సెల్లర్స్ డా. నిరంజన్ గౌడ్, డా. రాఘవేందర్ రెడ్డి, డా. హన్మంతు, డా. వెంకటేశ్ మద్దినేని, ప్రాంతీయ అధ్యయన కేంద్రం కార్యాలయ సిబ్బంది, ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

INSTITUTIONAL DEVELOPMENT PLAN CRUCIAL FOR UNIVERSITIES : Prof.Ghanta Chakrapani

• “Education Week” Concluded at BRAOU  • BRAOU Releases “Institutional Development Plan-2026 ...