News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Thursday, September 17, 2026

అంబేద్కర్ వర్షిటీలో ఘనంగా తెలంగాణా ప్రజాపాలన దినోత్సవం

                          


  • జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి 

హైదరాబాద్, సెప్టెంబర్ 17,2026: డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వేఛ్చ రాలేదని ఆ సమయంలో ఇక్కడి ప్రజల పోరాటాల ఫలితంగా హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు స్వాతంత్రం సిద్దించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత దశాబ్దాల పాటు కొనసాగిన తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా విశ్వవిద్యాలయంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు, నూతన నిర్ణయాలకు, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి ఉద్యోగులకు వివరించారు. అంతకుముందు వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, ఉద్యోగులు విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని రాజ్యంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, డా.యల్. విజయ కృష్ణా రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, ప్రొ. ఆనంద్ పవార్, వీసీ ఓఎస్డీ ప్రొ. డి.రబింద్రనాథ్ సోలమన్; ప్రొ. పల్లవీ కాబ్డే, ప్రొ . పి . వెంకట రమణ; డా.వై. వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల డైరెక్టర్స్, డీన్స్ బోధన మరియు భోదనేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్; భరత్ రెడ్డి, డా. యాకేష్ దైద తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...