News Bulletin of Dr. B.R. Ambedkar Open University, Hyderabad

Wednesday, September 16, 2026

సెప్టెంబర్ 17 & 18 తేదీలలో అంబేద్కర్ వర్శిటీ బి.ఎడ్ కౌన్సిలింగ్



హైదరాబాద్ : డా. బి. ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 సంవత్సరానికి బి.ఎడ్ కౌన్సెలింగ్ ఈ నెల 17-18 తేదిల్లో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. బి.ఎడ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సెప్టెంబర్ 17వ తేదీన మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులకు, అదేవిధంగా 18 తేదీ సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వివరించారు. వెబ్ ఆప్షన్ లో  సీట్లు సాధించిన విద్యార్థులు అవసరమైన సర్టిఫికెట్లు పత్రాలతో విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయానికి రావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం  విద్యార్థులు విశ్వవిద్యాలయ కాల్ సెంటర్: 18005990101 లేదా హెల్ప్ డెస్క్ : 040-23680222/333/444/555 ఫోన్ నంబర్లలో లేదా విశ్వవిద్యాలయ పోర్టల్‌ www.braouonline.in లేదా www.braou.ac.in లో వివరాలు పొందొచ్చని సూచించారు.


 

No comments:

Post a Comment

27th Convocation of Dr. B.R. Ambedkar Open University

• Honorary Doctorate to be conferred on renowned filmmaker, writer, and actor Shri B. Nars...