- Vice Chancellor Prof. Ghanta Chakrapani
డా. బి. ఆర్. అంబేద్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త - : వీసీ. ప్రొ. ఘంటా చక్రపాణి
సైన్స్ తోనే దేశంలో పంటల దిగుబడి పెరిగింది
- : ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డా.హిమాన్ష్ పాఠక్
హైదరాబాద్ ఫిబ్రవరి 28, 2026 : దేశంలో ఎంత మంది శాస్త్రవేత్తలు ఉన్నా వాళ్ళు వారి వారి రంగాల్లో విశేష పరిశోధనలు చేసి దేశాభివృద్ధికి పాటు పడ్డారని అయితే ఈ దేశంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం పరితపించిన రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గొప్ప సామాజిక శాస్త్రవేత్త అని డా.బి ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అభిప్రాయపడ్డారు. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, సైన్స్ విభాగం ఆధ్వర్యంలో భారత భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ గౌరవార్ధం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.









